JavaScript Input & Output తెలుగులో | console.log, alert, prompt, confirm
ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? మీరు వెయిటర్ కి ఆర్డర్ చెబుతారు (input). వంటగది ఆ ఆర్డర్ తయారు చేసి, మీ టేబుల్ కి భోజనం తెస్తారు (output). Programs కూడా అలాగే పని చేస్తాయి: user నుంచి ఏదైనా తీసుకుంటాయి, లెక్కించి, ఫలితం చూపిస్తాయి.
ఇప్పటివరకు మనం console.log() తో output చూపించాం. ఈ chapter లో output చూపించే మరిన్ని మార్గాలు, మరియు user నుంచి input తీసుకునే విధానం నేర్చుకుందాం.
console.log,console.error,console.warn,console.tablealert()తో popup message చూపించడంprompt()తో user నుంచి input తీసుకోవడంconfirm()తో అవును/కాదు అడగడం- Node.js లో input తీసుకునే పద్ధతి (చిన్న పరిచయం)
- Page లో output చూపించడం (DOM పరిచయం)
1. console.log(): ఇప్పటికే తెలిసినదే
ఒకేసారి ఎన్ని విషయాలైనా కామాలతో వేరు చేసి print చేయొచ్చు:
console.log("పేరు:", "రవి", "వయసు:", 20);
పేరు: రవి వయసు: 20
2. console.error() మరియు console.warn()
ఇవి print చేస్తాయి, కానీ browser console లో ఎరుపు (error) లేదా పసుపు (warning) రంగులో కనిపిస్తాయి.
console.log("ఇది సాధారణ message");
console.warn("ఇది హెచ్చరిక");
console.error("ఇది error message");
ఇది సాధారణ message
ఇది హెచ్చరిక (పసుపు రంగులో)
ఇది error message (ఎరుపు రంగులో)
రంగులు browser console లో మాత్రమే కనిపిస్తాయి. Text అయితే అన్నీ ఒకేలా ఉంటుంది.
3. console.table(): పట్టిక రూపంలో చూపించడం
ఎక్కువ డేటా ఉన్నప్పుడు, console.table() దాన్ని చక్కని పట్టికగా చూపిస్తుంది:
const students = [
{ name: "Ravi", marks: 80 },
{ name: "Sita", marks: 90 },
{ name: "Kiran", marks: 75 }
];
console.table(students);
(index) name marks
0 "Ravi" 80
1 "Sita" 90
2 "Kiran" 75
Arrays మరియు objects ని ముందు chapters లో వివరంగా నేర్చుకుంటాం. ఇప్పటికి కేవలం console.table() ఎంత చక్కగా డేటాని చూపిస్తుందో గమనించండి. పట్టిక రూపం browser ని బట్టి, Node.js ని బట్టి కొద్దిగా మారొచ్చు.
alert(): Popup message చూపించడంalert() browser లో ఒక చిన్న popup box చూపిస్తుంది. User OK నొక్కేవరకు page లో ఏమీ చేయలేరు:
alert("స్వాగతం! JavaScript నేర్చుకుందాం");
ఫలితం: Browser లో ఒక popup వస్తుంది, అందులో ఆ message మరియు OK బటన్ ఉంటాయి.
alert(), prompt(), confirm() browser లో మాత్రమే పని చేస్తాయి. Node.js లో లేదా online compilers లో ఇవి పని చేయవు, ఇలా error వస్తుంది:
ReferenceError: alert is not defined
ఈ examples ని పరీక్షించడానికి browser console (F12) లేదా index.html file వాడండి.
prompt(): User నుంచి input తీసుకోవడంprompt() ఒక popup తో user ని ఏదైనా అడుగుతుంది. User టైప్ చేసిన దాన్ని program కి తిరిగి ఇస్తుంది:
const name = prompt("మీ పేరు ఏమిటి?");
alert(`నమస్కారం ${name}!`);
- "మీ పేరు ఏమిటి?" అని ఒక popup వస్తుంది, దానిలో టైప్ చేయడానికి ఒక box ఉంటుంది.
- User "రవి" అని టైప్ చేసి OK నొక్కితే,
nameలో"రవి"నిల్వ అవుతుంది. - తర్వాత "నమస్కారం రవి!" అనే alert వస్తుంది.
Default విలువ ఇవ్వడం
prompt() కి రెండో విలువ ఇస్తే, అది box లో ముందే నింపి ఉంటుంది:
const city = prompt("మీ ఊరు ఏది?", "హైదరాబాద్");
console.log(city);
User ఏమీ మార్చకుండా OK నొక్కితే "హైదరాబాద్" వస్తుంది.
prompt() ఎప్పుడూ string ఇస్తుంది!
User 25 అని టైప్ చేసినా, prompt() ఇచ్చేది "25" అనే string. అందుకే లెక్కలు చేసే ముందు Number() వాడాలి.
const age = prompt("మీ వయసు ఎంత?");
console.log(typeof age);
string
ఉదాహరణ: రెండు సంఖ్యల మొత్తం
const a = Number(prompt("మొదటి సంఖ్య:"));
const b = Number(prompt("రెండో సంఖ్య:"));
alert(`మొత్తం: ${a + b}`);
మొత్తం: 30
Number() వాడకపోతే "10" + "20" అతికించబడి "1020" వచ్చేది.
Cancel నొక్కితే ఏం జరుగుతుంది?
| User చేసేది | prompt() ఇచ్చేది |
|---|---|
| Cancel నొక్కుతే | null |
| ఖాళీగా OK నొక్కుతే | "" (ఖాళీ string) |
hello టైప్ చేస్తే | "hello" |
confirm(): అవును / కాదు అడగడంconfirm() ఒక popup తో రెండు బటన్లు (OK మరియు Cancel) చూపిస్తుంది. OK నొక్కితే true, Cancel నొక్కితే false ఇస్తుంది:
const wantsDelete = confirm("ఈ file ని delete చేయాలా?");
console.log(wantsDelete ? "Delete అయ్యింది" : "Cancel చేశారు");
Delete అయ్యింది
Cancel నొక్కితే:
Cancel చేశారు
మూడింటి పోలిక
| Function | పని | ఏమి తిరిగి ఇస్తుంది |
|---|---|---|
alert() | message చూపిస్తుంది | undefined |
prompt() | text తీసుకుంటుంది | string లేదా null |
confirm() | అవును/కాదు అడుగుతుంది | true లేదా false |
ఈ రోజుల్లో నిజమైన వెబ్సైట్లలో alert మరియు prompt లను దాదాపు ఎవరూ వాడరు, ఎందుకంటే అవి page ని ఆపేస్తాయి. కానీ నేర్చుకోవడానికి, చిన్న tests కి అవి చాలా సులభం. నిజమైన sites లో HTML forms వాడతాం.
మీరు browser కాకుండా Node.js లో JavaScript run చేస్తే, prompt() ఉండదు. అక్కడ readline అనే built-in module వాడతాం:
const readline = require("readline");
const rl = readline.createInterface({
input: process.stdin,
output: process.stdout
});
rl.question("మీ పేరు ఏమిటి? ", (name) => {
console.log(`నమస్కారం ${name}!`);
rl.close();
});
మీ పేరు ఏమిటి? Ravi
నమస్కారం Ravi!
ఇందులో (name) => { ... } అనేది ఒక arrow function. Functions ని తర్వాత chapters లో నేర్చుకుంటాం. ఇప్పుడు "Node.js లో input ఇలా తీసుకుంటారు" అని మాత్రం తెలుసుకోండి.
Online compiler లో user input ఇవ్వడానికి "Input" box వాడండి. అలా కాకపోతే, విలువలను code లోనే variables గా రాసి practice చేయొచ్చు.
console.log() output page లో కనిపించదు, అది developer కి మాత్రమే (console లో). వెబ్సైట్ visitors కి ఫలితం page లోనే చూపించాలి:
<!DOCTYPE html>
<html>
<body>
<h2 id="greeting"></h2>
<script>
const name = prompt("మీ పేరు ఏమిటి?");
document.getElementById("greeting").innerText = `నమస్కారం ${name}!`;
</script>
</body>
</html>
<h2 id="greeting">ఒక ఖాళీ heading, దానికిgreetingఅనే పేరు (id) పెట్టాం.document.getElementById("greeting")ఆ heading ని "వెతికి పట్టుకుంటుంది"..innerText = ...ఆ heading లో text ని పెడుతుంది.
ఇదే DOM యొక్క మొదటి రుచి. DOM గురించి తర్వాతి chapters లో వివరంగా నేర్చుకుంటాం.
Celsius ని Fahrenheit గా మార్చే సూత్రం: F = C × 9 / 5 + 32:
const celsius = Number(prompt("Celsius లో ఉష్ణోగ్రత ఎంత?"));
const fahrenheit = celsius * 9 / 5 + 32;
alert(`${celsius}°C = ${fahrenheit}°F`);
100°C = 212°F
User 25 ఇస్తే: 25°C = 77°F
User 0 ఇస్తే: 0°C = 32°F
-
1.
prompt()ఫలితం string అని మర్చిపోవడం:
సరిచేయడం:const a = prompt("సంఖ్య 1:"); const b = prompt("సంఖ్య 2:"); console.log(a + b); // "1020" వస్తుంది, 30 కాదు!Number(a) + Number(b) -
2. Cancel నొక్కితే
nullవస్తుందని మర్చిపోవడం:Number(null)అనేది0అవుతుంది,NaNకాదు. Cancel ని ముందే చెక్ చేయాలి. -
3. Browser functions ని Node.js లో వాడటం:
alert("Hello"); // Node.js లో: ReferenceError: alert is not defined -
4.
console.log()page లో కనిపిస్తుందనుకోవడం:console.log()browser console లో మాత్రమే కనిపిస్తుంది. Page visitors కి చూపించాలంటేinnerTextవాడాలి. -
5.
alertని ఎక్కువగా వాడటం: ప్రతి చిన్న విషయానికిalertవాడితే user కి చిరాకు వస్తుంది. Debug చేయడానికిconsole.logవాడండి.
prompt()తో user పేరు మరియు ఊరు అడిగి,alertలో "నమస్కారం ___, మీరు ___ నుంచి వచ్చారు" అని చూపించండి.- రెండు సంఖ్యలు అడిగి, వాటి గుణకారం alert లో చూపించండి.
- ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పు అడిగి, దాని వైశాల్యం (area = పొడవు × వెడల్పు) చూపించండి.
- Celsius ఇస్తే Fahrenheit చూపించే converter రాయండి. (
F = C × 9 / 5 + 32) confirm("మీకు 18 ఏళ్లు నిండాయా?")అడిగి, OK అయితే "మీరు ఓటు వేయొచ్చు", Cancel అయితే "ఇంకా కొన్ని సంవత్సరాలు వేచి చూడండి" అని చూపించండి.
సమాధానాలు చూడండి
1.
const name = prompt("మీ పేరు ఏమిటి?");
const city = prompt("మీ ఊరు ఏది?");
alert(`నమస్కారం ${name}, మీరు ${city} నుంచి వచ్చారు`);
2.
const x = Number(prompt("మొదటి సంఖ్య:"));
const y = Number(prompt("రెండో సంఖ్య:"));
alert(`గుణకారం: ${x * y}`);
3.
const length = Number(prompt("పొడవు ఎంత?"));
const breadth = Number(prompt("వెడల్పు ఎంత?"));
alert(`వైశాల్యం: ${length * breadth}`);
పొడవు 5, వెడల్పు 4 ఇస్తే: వైశాల్యం: 20
4.
const c = Number(prompt("Celsius లో ఉష్ణోగ్రత:"));
const f = c * 9 / 5 + 32;
alert(`${c}°C = ${f}°F`);
100 ఇస్తే: 100°C = 212°F
5.
const isAdult = confirm("మీకు 18 ఏళ్లు నిండాయా?");
console.log(isAdult ? "మీరు ఓటు వేయొచ్చు" : "ఇంకా కొన్ని సంవత్సరాలు వేచి చూడండి");
Browser లేనప్పుడు కూడా పని చేసే విధంగా, విలువలను variables లో పెట్టి చక్కని output చూపించే ఈ code ని run చేయండి:
const shopName = "Ravi Stores";
const ricePrice = 60;
const riceQty = 2;
const dalPrice = 120;
const dalQty = 1;
const oilPrice = 150;
const oilQty = 1;
const total = ricePrice * riceQty + dalPrice * dalQty + oilPrice * oilQty;
console.log(`--- ${shopName} ---`);
console.log(`Rice: ₹${ricePrice} x ${riceQty} = ₹${ricePrice * riceQty}`);
console.log(`Dal: ₹${dalPrice} x ${dalQty} = ₹${dalPrice * dalQty}`);
console.log(`Oil: ₹${oilPrice} x ${oilQty} = ₹${oilPrice * oilQty}`);
console.log(`మొత్తం బిల్లు: ₹${total}`);
--- Ravi Stores ---
Rice: ₹60 x 2 = ₹120
Dal: ₹120 x 1 = ₹120
Oil: ₹150 x 1 = ₹150
మొత్తం బిల్లు: ₹390
📌 Quick Summary:
- Output కోసం:
console.log()(సాధారణం),console.warn()(హెచ్చరిక),console.error()(తప్పు),console.table()(పట్టిక). alert()popup తో message చూపిస్తుంది.prompt()user నుంచి text తీసుకుంటుంది, ఎప్పుడూ string గా ఇస్తుంది (Cancel అయితేnull). లెక్కలకుNumber()తప్పనిసరి.confirm()OK అయితేtrue, Cancel అయితేfalseఇస్తుంది.alert,prompt,confirmbrowser లో మాత్రమే పని చేస్తాయి. Node.js లోreadlineవాడతాం.- Page లో ఫలితం చూపించాలంటే
document.getElementById("id").innerText = ...వాడతాం.
🎉 Part 1 పూర్తి అయ్యింది!
అభినందనలు! మీరు JavaScript Basics అన్నీ పూర్తి చేశారు:
- JavaScript పరిచయం
- Setup (console, script tag, external file)
- Variables (
let,const,var) - Data Types
- Operators
- Type Conversion & Template Literals
- Input & Output ✅
తర్వాత Part 2: Control Flow — ఇక్కడ మీ programs నిర్ణయాలు తీసుకోవడం (if-else) మరియు పనులను పునరావృతం చేయడం (loops) నేర్చుకుంటాయి.